దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్(dale steyn retirement) మంగళవారం (ఆగస్టు 31) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2004లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు 2020లో ఆస్ట్రేలియాపై చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. అయితే, రెండు మూడేళ్లుగా గాయాలబారిన పడటం వల్ల స్టెయిన్ పెద్దగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.
"ట్రైనింగ్, మ్యాచ్‌లు, ట్రావెల్, విజయాలు, ఓటములు, గాయాలతో 20 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలో అద్భుత జ్ఞాపకాలు సంపాదించా. చాలామందికి ధన్యవాదాలు తెలపాలి. ఇక నేను నా కెరీర్‌ను ముగిస్తున్నా. అధికారికంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నా. నా ఈ ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు, సహ ఆటగాళ్లు, జర్నలిస్టులు, అభిమానులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు."
-స్టెయిన్, దక్షిణాఫ్రికా క్రికెటర్
స్టెయిన్‌పై ప్రశంసలు
దీంతో స్టెయిన్ అద్భుత ప్రదర్శన గుర్తుచేసుకుంటా పలువురు దిగ్గజ క్రికెటర్లు సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అతడి భవిష్యత్ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు.
"ముందుకు సాగిపో. నువ్వో నిప్పు. క్రికెట్లోని ఉత్తమ ఆటగాళ్లలో నువ్వు ఒకరివి."
-సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్.
"అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. నువ్వు సాధించిన ఘనతకు గర్వపడాలి. నీ సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా కొనసాగాలని కోరుకుంటున్నా."
- వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
"నా ఫేవరెట్ ఆల్‌టైం, గొప్ప లెజెండ్ ఆటగాడు"
-హార్దిక్ పాండ్యా, టీమ్ఇండియా ఆల్‌రౌండర్
"లెజెండ్. అన్ని పరిస్థితుల్లోనూ గొప్పగా ఆడే ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు. త్వరలో కలుద్దాం."
-ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.
"డేల్ నీది ఎంతో గొప్ప కెరీర్. నా ఆఫ్ స్టంప్స్‌ను చాలా సార్లు పాడుచేసినందుకు ధన్యావాదాలు."