Cricket Clashes In 2023 : మరో 20 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా ఎందరో ఆదరించే క్రికెట్ ఆటలో ఎన్నో రికార్డులను చూశాము. వీటితో పాటు చెరగిపోని జ్ఞాపకాలు, మరిచిపోని చేదు అనుభవాలను, సన్నివేశాలము చూశాము. వీటిలో కొన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పడగా మరికొన్ని అలానే ఉండిపోయాయి. మరి వాటిపై మీరు ఓ లుక్కేయండి.
కోహ్లి-గంభీర్-నవీనుల్!
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో బెంగళూరు-లఖ్‌నవూ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అంతకుముందు కోహ్లితో అఫ్గాన్ ప్లేయర్ నవీనుల్ హక్ కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో తన యాటిట్యూడ్‌ను కోహ్లిపై చూపించాడు. ఈ వరుస వివాదాలతో మైదానం మొత్తం హీటెక్కిపోయింది. అయితే కొన్ని నెలల తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లి-నవీనుల్ మధ్య నెలకొన్న మనస్ఫర్థలకు ఎండ్ కార్డ్ పడింది.
సీనియర్ల మధ్య ఘర్షణ!
ఇటీవల జరిగిన లెజెండ్స్ లీగ్ టీ10 క్రికెట్లో సీనియర్ ప్లేయర్లు గౌతమ్ గంభీర్- శ్రీశాంత్ మధ్య కూడా ఓ వివాదం తలెత్తింది. శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్ వరుసగా ఓ సిక్సర్, బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరి ముఖాలు సీరియస్‌గా మారిపోయాయి. కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో అంపైర్లు రావడం వల్ల ఇద్దర మధ్య వాగ్వాదానికి కాస్త బ్రేక్ పడింది. ఆ తర్వాత శ్రీశాంత్ గంభీర్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంపై LLC నిర్వాహకులు శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అయితే ఈ వివాదం ఇంకా ముగిసిపోలేదు.