తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ది హండ్రెడ్​' లీగ్​కు ఆసీస్​ ప్లేయర్స్​ దూరం! - the hundred league australia cricketers

ఇంగ్లాండ్ బోర్డు నిర్వహించాలనుకున్న 100 బంతుల క్రికెట్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరమయ్యే అవకాశముంది. కరోనా ప్రయాణ ఆంక్షలు సహా అదే సమయంలో వెస్టిండీస్​తో సిరీస్​ ఉండటమే ఇందుకు కారణం.

aus play
ఆసీస్​ ప్లేయర్స్

By

Published : May 24, 2021, 2:39 PM IST

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు మొదలుపెట్టాలనుకున్న 'ద హండ్రెడ్'(100 బంతుల) టోర్నీ ప్రారంభ సీజన్​కు షాక్ ఇచ్చారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. వాళ్లు ఈ టోర్నీకి దూరం కానున్నారు. జులై 22 నుంచి ఈ లీగ్​ ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నాక 14రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలి.

కాగా, అదే సమయంలో వెస్టిండీస్​తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది ఆసీస్​. ఈ సిరీస్​ జులై 25న ముగియనుంది. కాబట్టి వీరు 'ది హండ్రెడ్'​ టోర్నీకి అందుబాటులో ఉండలేరు. ఈ నేపథ్యంలో వార్నర్​, గ్లెన్​ మాక్స్​వెల్​, ఆరోన్​ ఫించ్​ సహా పలువురు ఆసీస్​ ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి వైదొలిగే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details