తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఐపీఎల్​కు అందుబాటులో ఆసీస్​ స్టార్స్ - ఐపీఎల్​ 2022 విదేశీ ఆటగాళ్లు

IPL 2022 Australia Players: ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు లైన్​ క్లియర్ అయింది. తమ ప్లేయర్లకు నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) మంజూరు చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).

IPL 2022 Australia Players
IPL 2022 Australia Players

By

Published : Feb 22, 2022, 4:51 PM IST

IPL 2022 Australia Players: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్​ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది ఐపీఎల్​​లో పాల్గొనేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) మంజూరు చేసింది. దీంతో డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్​, గ్లెన్ మాక్స్‌వెల్ స్టార్లు ఏప్రిల్​ 6 నుంచి ఐపీఎల్​కు అందుబాటులో వచ్చే అవకాశముంది.

అయితే తమ ఆటగాళ్లు వెంటనే ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరని సీఏ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ పర్యటన ముగిసిన తర్వాత మాత్రమే ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటారని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. "అవును. ఈ ఐపీఎల్​ సీజన్​లో మా ప్లేయర్లు పాల్గొనేందుకు ఎన్​ఓసీ మంజూరు చేశాం. అయితే పాకిస్థాన్​ పర్యటన ముగిసిన తర్వాతే వారు అందుబాటులో ఉంటారు" ఆ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా 1998 తర్వాత తొలిసారి పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లనుంది ఆస్ట్రేలియా. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్​ ఆడనుంది. చివరి మ్యాచ్​ ఏప్రిల్​ 5న జరగనుంది.

ఐపీఎల్​లో వార్నర్​, మిచెల్​ మార్ష్​.. దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనుండగా, గ్లెన్ మాక్స్‌వెల్​, జోష్ హేజిల్‌వుడ్ రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్​-2022 సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:'బిజీ షెడ్యూల్‌లో టీమ్​ఇండియా.. రోహిత్‌కు అతిపెద్ద సవాలు'

ABOUT THE AUTHOR

...view details