కొవిడ్ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న నష్టంపై విచారం వ్యక్తం చేశాడు టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మహమ్మారితో పోరాడుతున్న బాధితులకు తన వంతు సాయం చేస్తానని ప్రకటించాడు. కరోనా రెండో దశ హృదయ విదారకంగా ఉందని ఆవేదనగా వ్యక్తం చేశాడు.
"దేశంలో నిత్యం ఏం జరుగుతుందో చూడటానికి భయనకంగా ఉంది. నేను వైద్య బృందంలో పని చేయకపోవచ్చు. కానీ, వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ప్రతి భారతీయుడిని నేను కోరుకునేది ఒక్కటే.. జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి" అని అశ్విన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.