కరోనాతో పోరాడుతున్న భారత్‌కు పలువురు క్రికెటర్లు విరాళాలు అందిస్తూ.. తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు బౌలర్ జైదేవ్ ఉనద్కత్ సాయం ప్రకటించారు. వీరితో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ మీడియా అసోసియేషన్ కూడా విరాళం ఇచ్చింది.
- దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం ఉద్దేశించిన 'మిషన్ ఆక్సిజన్'కు.. శిఖర్ రూ.20 లక్షలతో పాటు మ్యాచ్‌ల అనంతరం వచ్చే అవార్డుల మొత్తాన్ని సాయంగా ఇస్తున్నట్లు తెలిపాడు.
- మరో ఆటగాడు జైదేవ్ ఉనద్కత్ తన ఐపీఎల్ జీతంలో 10 శాతాన్ని దేశంలోని వైద్య నిత్యవసరాలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు.
- ఆస్ట్రేలియా క్రికెట్ మీడియా అసోసియేషన్ కూడా దేశానికి బాసటగా నిలిచింది. రూ.31 లక్షలను విరాళంగా ప్రకటించింది.
- 250లకుపైగా యువకులు ఈ మిషన్ ఆక్సిజన్‌ను స్థాపించారు. ఇందులో వచ్చిన విరాళాలను దేశవ్యాప్తంగా కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్రేటర్స్ కోసం వెచ్చించనున్నారు.