తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎన్​95 మాస్క్​ల పంపిణీకి నేను సిద్ధం'

కరోనాపై మరోసారి ట్విట్టర్​ వేదికగా అవగాహన కల్పించాడు టీమ్​ఇండియా క్రికెటర్ అశ్విన్. మాస్క్​లు కొనలేని వారికి ఎన్​95 మాస్క్​లు ఇవ్వడానికి తాను సిద్ధమని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ రెండు మాస్క్​లు ధరించాలని కోరాడు.

Ashwin, ready to buy N95 masks for people who can't afford it
రవిచంద్రన్ అశ్విన్​, 'ఎన్​95 మాస్క్​ల పంపిణీకి నేను సిద్ధం'

By

Published : May 7, 2021, 1:52 PM IST

కరోనాపై అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​. మహమ్మారికి సంబంధించి మరోసారి ట్విట్టర్​ వేదికగా అభిమానులకు పలు సూచనలు చేశాడు. బట్టతో తయారు చేసిన మాస్క్​లు కాకుండా ఎన్​95 మాస్క్​లను వాడాలని కోరాడు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించాడు.

"కొవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి వీలైనంత త్వరగా టీకా తీసుకోండి. బట్టతో తయారు చేసిన మాస్క్​ కాకుండా.. దయచేసి ప్రతి ఒక్కరూ రెండు​ మాస్క్​లు ధరించండి" అని ట్వీట్ చేశాడు అశ్విన్​.

ఇదీ చదవండి:రోడ్రిగేజ్​పై గెలవడమే లక్ష్యం: వాటర్​సన్

దీనికి స్పందించిన ఓ ట్విట్టర్​ యూజర్​.. తనకు రెండో డోస్​ టీకా ఇంకా వేయలేదని తెలిపాడు. ప్రతిస్పందించిన అశ్విన్.. మనది అతి ఎక్కువ జనాభా గల దేశం. దయచేసి మీ వంతు వచ్చే వరకు జాగ్రత్తగా వేచి ఉండండని సూచించాడు.

మరోక వ్యక్తి.. ఎన్95 మాస్క్​లు ఖరీదైనవి. వాటిని మేము వాడలేమని పేర్కొన్నాడు. "వాటిని శుభ్రం చేసి మళ్లీ వాడవచ్చు. వాటిని కొనలేని వారికి నేను ఇవ్వగలను. అవి ప్రజలకు ఎలా చేరాలన్నది నాకు సూచించండి చాలు" అని అశ్విన్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:నాదల్, ఒసాకాను వరించిన ప్రతిష్ఠాత్మక లారస్​ అవార్డు

ABOUT THE AUTHOR

...view details