తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండు పరుగులకు ఆలౌటవడం ఏందయ్యా! - రెండు పరుగులకు ఆలౌట్

కౌంటీ క్రికెట్​ మ్యాచ్​లో ఓ జట్టు కేవలం 2 పరుగులకే ఆలౌటై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హంటింగ్టన్​షైర్ కౌంటీ లీగ్ మ్యాచ్​లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ లీగ్​లో భాగంగా బక్డెన్​ క్రికెట్ క్లబ్-ఫాల్కన్ మధ్య జరిగిన మ్యాచ్​లో బక్డెన్​ జట్టు కేవలం రెండు పరుగులకే చేతులెత్తేసింది.

County league
కంట్రీ లీగ్

By

Published : Jun 22, 2021, 1:31 PM IST

ఓ క్రికెట్​లో మ్యాచ్​లో రెండు పరుగులకే ఆలౌటవడం ఎప్పుడైనా చూశారా? అది టీ20 అయినా సరే కనీసం 10, 20 పరుగులు చేయొచ్చు. కానీ ఓ జట్టు మాత్రం 2 పరుగులకే ఆలౌటై క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. హంటింగ్టన్​షైర్ కౌంటీ లీగ్ మ్యాచ్​లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ లీగ్​లో భాగంగా బక్డెన్​ క్రికెట్ క్లబ్-ఫాల్కన్ మధ్య జరిగిన మ్యాచ్​లో బక్డెన్​ జట్టు కేవలం రెండు పరుగులకే చేతులెత్తేసింది.

సింగిల్ రన్ తీయలేకపోయారు

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్​ ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన బక్డెన్​ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్​మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారు. వైడ్, బై కారణంగా రెండు పరుగులు వచ్చాయి. దీంతో 2 పరుగులకే ఆలౌటైంది జట్టు. ఫలితంగా 258 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఫాల్కన్.

స్కోర్ కార్డ్

అదే కారణం

ఇంతటి దారుణ ఓటమి తర్వాత మాట్లాడిన బక్డెడ్ కెప్టెన్ జోయల్ కిర్​చ్నర్​.. అందుకు గల కారణాన్ని వివరించాడు. "మా జట్టులోని 15 మంది ఈ మ్యాచ్​కు గైర్హాజయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల వారంతా రాలేకపోయారు. దీంతో రెండో జట్టుతో బరిలో దిగాల్సి వచ్చింది. ఆట ప్రారంభమయ్యే సమయానికి 8 మందిమే ఉన్నాం. వ్యక్తిగత పని చూసుకొని 30 ఓవర్ సమయంలో గ్రహమ్ పీర్స్​ వచ్చాడు. ఇది చెత్త జట్టని నేను అంగీకరిస్తున్నా. ఇంతకుముందు ఫాల్కన్​తో జరిగిన మ్యాచ్​లో మేము 9 పరుగుల తేడాతో మాత్రమే ఓడిపోయాం" అని వెల్లడించాడు జోయల్.

ఇవీ చూడండి: సిక్సర్​తో సొంత కారు అద్దాలు ఢమాల్

ABOUT THE AUTHOR

...view details