అన్ని జాగ్రత్తలు తీసుకుని క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ, వైరస్ ప్రభావం వదలడం లేదు. ఆదివారం జరగాల్సిన శ్రీలంక-బంగ్లాదేశ్ వన్డేకు ముందు ఇప్పుడు ఇదే తరహా అనుభవం ఎదురైంది. లంక జట్టులోని ముగ్గురు సభ్యులకు తొలుత పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత మరోసారి పరీక్ష చేయగా అందులో ఒకరికే వైరస్ నిర్ధరణ అయింది.
తొలుత బౌలింగ్ కోచ్ చమిందా వాస్, ఆటగాళ్లు ఇసురు ఉదానా, షిరానో ఫెర్నాండ్కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరోసారి పరీక్షలు చేయగా, ఫెర్నాండోకు మాత్రమే వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని దిముత్ కరుణరత్నె ట్వీట్ చేశాడు.