దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీలో(syed mushtaq ali trophy) హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆరు జట్లపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ తమిళనాడుతో(HYD vs TN semi final) తలపడేందుకు సన్నద్ధమవుతోంది. శనివారం(నవంబర్ 20) ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ముస్తాక్ అలీ టోర్నీలో రెండుసార్లు ఫైనల్ చేరిన తమిళనాడు.. మరోసారి తుదిపోరుకు చేరేందుకు ప్రయత్నిస్తోంది. 2019లో కర్ణాటకతో ఫైనల్ మ్యాచ్‌లో తడబడిన తమిళనాడు.. 2020-21 సీజన్లో అద్భుత ప్రదర్శనతో కప్పు సొంతం చేసుకుంది.
సమష్టిగా తమిళ జట్టు ఆటగాళ్లు..
జగదీశన్, సీ హరి నిశాంత్, బీ సాయి సుదర్శన్ కెప్టెన్ విజయ్ శంకర్‌తో తమిళనాడు బ్యాటింగ్ లైనప్ దృఢంగా ఉంది. తమిళ జట్టు బ్యాటర్లు ఈ టోర్నీలో మూడు అర్థశతకాలే నమోదు చేశారు. అయినప్పటికీ ప్రతి ఆటగాడి మేటి ప్రదర్శన చేయడం వల్ల ఆ జట్టు గెలుపు దిశగా అడుగులేసింది. ఆర్ సంజయ్ యాదవ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతుండగా, స్పిన్నర్లు ఆర్ సాయి కిశోర్, మురుగన్ అశ్విన్ జట్టుగా బలంగా మారారు.
అగర్వాల్, తిలక్ మెరుపులు..
హైదరాబాద్ జట్టు సారథి తన్మయ్ అగర్వాల్(333 పరుగులు ఆరు మ్యాచ్‌ల్లో), బ్యాటర్ తిలక్ వర్మ(207 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణిస్తారు. బౌలింగ్‌లో ఛామా మిలింద్ 18 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు జట్టు జోరును కట్టడిచేసేందుకు హైదరాబాద్ జట్టు ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.
సమస్యలను దిగమింగి..