Commonwealth Games IND Vs AUS: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా మహిళల టీ20 తొలి మ్యాచ్‌లో భారత్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. మూడు వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ అదరగొట్టింది. బ్యాటర్ ఆష్లే గార్డనర్(52) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మరో బ్యాటర్ గ్రేస్ హ్యారిస్(37) రాణించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్ 1, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మహిళల జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(52) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. షెఫాలీ వర్మ(48) రాణించింది. వీరిద్దరూ మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జెస్ జొనాసెన్ 4 వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేసింది. మెగాన్ స్కూఫ్ రెండు వికెట్లు తీయగా.. డార్సీ బ్రౌన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకుంది.