తెలంగాణ

telangana

ETV Bharat / sports

దాదా, అజారుద్దీన్​ కాంట్రవర్సీ ట్వీట్స్​.. ఓ రేంజ్​లో నెటిజన్స్​ ఫైర్​ - భారత మహిళా జట్టుపై అజారుద్దీన్​ ట్వీట్​

కామన్వెల్త్​ గేమ్స్​ ఫైనల్స్​లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న భారత మహిళా క్రికెట్​ జట్టు ప్రదర్శనపై కాంట్రవర్సీ కామెంట్స్​ చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, మరో మాజీ క్రికెటర్​ మహ్మద్​ అజారుద్దీన్. దీంతో వారిద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Azharuddin Ganguly conroversy tweet goes viral
దాదా, అజారుద్దీన్​ కాంట్రవర్సీ ట్వీట్​

By

Published : Aug 10, 2022, 12:23 PM IST

కామన్వెల్త్​ గేమ్స్​ 2022లో ఫైనల్స్​లో భారత మహిళా క్రికెట్​ జట్టు 9పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌లో భారత్‌కు 11పరుగులు అవసరమైన దశలో రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు చేజార్చుకుని పోరాటాన్ని ముగించింది.

అయితే ఈ ఓటమితో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సిన వచ్చిన భారత జట్టుపై మాజీ క్రికెటర్​ మహ్మద్​ అజారుద్దీన్ తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు ప్రదర్శనను నిందించాడు. ఇంగిత జ్ఞానం లేకుండా ఆడారు. గెలిచే ఆటను కంచెంలో తీసుకెళ్లి ప్రత్యర్థి చేతికి అప్పగించారు అని ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై విమర్శలు చేస్తూ కామెంట్లతో పోటెత్తారు. మహిళా జట్టు పోరాటానికి మద్దతు తెలిపారు.

మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా హర్మన్‌ సేనను అభినందిస్తూనే, మరోవైపు చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. "సిల్వర్‌ గెలిచినందుకు భారత మహిళా క్రికెట ​జట్టుకు అభినందనలు‌.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్‌ వాళ్ల చేతుల్లోనే ఉండింది" అంటూ దాదా సెట్టైర్​ వేశాడు. దీంతో ఈ ట్వీట్‌పై కూడా ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతుంది. అభిమానులు దాదాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇదీ చూడండి: రవిశాస్త్రి- ద్రవిడ్​పై ధావన్​ కామెంట్స్​.. ఇద్దరూ పూర్తి విరుద్ధమంటూ..

ABOUT THE AUTHOR

...view details