Common wealth games Teamindia: కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1998లో కౌలలాంపుర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మెన్స్ వన్డే క్రికెట్‌ను నిర్వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు బర్మింగ్హమ్ వేదికగా జరగనున్న 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు అవకాశమిచ్చారు. తాజాగా జట్టును ప్రకటించారు. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది ప్లేయర్స్ పేర్లను ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు లభించింది. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్ ఉండగా.. గ్రూప్-బీలో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా గ్రూప్-బీలో ఉన్నాయి. ఈ నెల 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి.
భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్ రాణా.