Virat Kohli Form: ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీకి మాజీలు, ప్రముఖుల నుంచి సలహాలు వస్తున్నాయి. తాజాగా విరాట్ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కూడా స్పందించారు. ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమ్‌ఇండియా ఈ జోష్‌తోనే వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ పర్యటనకు ప్రకటించిన టీమ్‌ఇండియా జట్టులో కోహ్లీ లేడు. దీంతో సోషల్ మీడియా వేదికగా విరాట్ అభిమానులు 'కోహ్లీకి ఇదే మంచి తరుణం, తన చిన్నప్పటి అకాడమీలో ప్రాక్టీస్ చేసి తిరిగి ఫామ్‌లోకి రావాలి' అని సూచిస్తున్నారు.
'కోహ్లీ టైమ్ దొరికితే నా దగ్గరికి వచ్చేయ్.. అలా చేద్దాం' - కోహ్లీ ఫామ్
ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ గురించి అతడి చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించారు. కోహ్లీ ఆటలో ఎటువంటి సమస్య లేదని అన్నారు. కోహ్లీ తన దగ్గరకు మళ్లీ వస్తే.. తప్పిదాలపై తామిద్దరు కలిసి పనిచేస్తామని చెప్పారు
కోహ్లీ ఫామ్
ఈ విషయమై రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ "ఈ అకాడమీ కోహ్లీ సొంత మైదానం. అతనికి సమయం టైమ్ దొరికినప్పుడల్లా నా సమక్షంలో ప్రాక్టీస్ చేయవచ్చు. విరాట్ ఇక్కడికి వచ్చి క్రికెట్‌ను ఆస్వాదిస్తే సంతోషమే. వాస్తవానికి కోహ్లీ ఆటలో ఎటువంటి సమస్య లేదు. అతడు కొన్ని మంచి బంతులకు ఔట్ అవుతున్నాడు. నా దగ్గరకు వస్తే ఆ తప్పిదాలపై కచ్చితంగా పనిచేస్తాం" అని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై