Chris Morris Retirement: దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ మంగళవారం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దేశవాళీ టీ20 జట్టు 'టైటాన్స్'కు కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నాడు. ఇన్స్టా గ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు మోరిస్.
"క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను. నా కెరీర్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టైటాన్స్ జట్టుకు కోచ్ బాధ్యతలు స్వీకరిస్తుండటం ఆనందంగా ఉంది."
-- క్రిస్ మోరిస్, సౌతాఫ్రికా క్రికెటర్.
2016లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు మోరిస్. అనంతరం ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులే ఆడి 173 పరుగులు చేశాడు. 12 వికెట్లు పడగొట్టాడు. 42 వన్డేల్లో 48 వికెట్లు, 23 టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు మోరిస్. బ్యాటింగ్ విషయానికొస్తే.. వన్డేల్లో 467 పరుగులు, టీ20ల్లో 133 పరుగులు చేశాడు.