Chris Cairns update on his Health: మళ్లీ తాను నడుస్తానో లేదో తెలియదని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ అన్నాడు. ప్రాణాపాయ స్థితిలో వరుస శస్త్రచిత్సల అనంతరం బతకడమే అదృష్టమని తెలిపాడు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కెయిన్స్‌కు వైద్యులు నాలుగు ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆపరేషన్లు చేస్తుండగానే కెయిన్స్ వెన్నుకు స్ట్రోక్ రావడం వల్ల పక్షవాతం వచ్చింది.
Chris Cairns Health: మళ్లీ నడుస్తానో లేదో తెలియదు: కెయిన్స్
Chris Cairns update on his Health: మళ్లీ తాను నడుస్తానో లేదో తెలియదని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ తెలిపాడు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కెయిన్స్‌కు వైద్యులు నాలుగు ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆపరేషన్లు చేస్తుండగానే కెయిన్స్ వెన్నుకు స్ట్రోక్ రావడం వల్ల పక్షవాతం వచ్చింది.
Chris Cairns
‘"మళ్లీ ఎప్పుడు నడుస్తానో లేదో తెలియదు. అందుకు సిద్ధమైపోయా. చక్రాల కుర్చీలో జీవితాన్ని ఆస్వాదించగలనని అర్థం చేసుకోవాలి. కానీ అదంతా పూర్తిగా భిన్నమని తెలుసుకోవాలి. ఇంకా బతికి ఉండటమే అదృష్టం. ఆసాంతం నా భార్య మెల్ అండగా ఉంది" అని 51 ఏళ్ల కెయిన్స్ తెలిపాడు.
1989-2006 మధ్యకాలంలో కెయిన్స్.. 62 టెస్టులు, 215 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. టెస్టుల్లో 3,320 పరుగులు చేసి 218 వికెట్లు తీశాడు. వన్డేల్లో 4,950 పరుగులు చేసి 201 వికెట్లు పడగొట్టాడు.