India Vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పుజారా మరో అరుదైన రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. అలా సునిల్ గవాస్కర్, సచిన్ తెందుల్కర్ వంటి దిగ్గజ ప్లేయర్ల పక్కన చోటు సంపాదించాడు.
షకీబ్ అల్ హసన్ వేసిన బంతి(18.5 ఓవర్)కి మూడు పరుగులు తీసి పుజారా 7 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే, మొదటి టెస్టులో సెంచరీ కొట్టిన పుజారా..రెండో మ్యాచ్‌లో 24 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. కౌంటీల్లో ససెక్స్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి టెస్టులో జట్టులోకి తిరిగి వచ్చాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు కొల్లగొట్టిన స్టార్స్ వీరే..
- సచిన్ టెండుల్కర్- 15,921
- రాహుల్ ద్రవిడ్- 13265
- సునిల్ గావస్కర్- 10122
- వీవీఎస్ లక్ష్మణ్- 8781
- వీరేంద్ర సెహ్వాగ్- 8503
- విరాట్ కోహ్లి- 8099*
- సౌరవ్ గంగూలీ- 7212
- ఛతేశ్వర్ పుజారా- 7000*