చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీకి కొవిడ్ నెగెటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో హస్సీకి కరోనా లేనట్లు తేలింది. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ధ్రువీకరించారు. అతడు నేరుగా ఆస్ట్రేలియా వెళ్తాడా? లేక మాల్దీవులకు వెళ్తాడా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
చెన్నై బ్యాటింగ్ కోచ్ హస్సీకి కొవిడ్ నెగెటివ్ - సీఎస్కే బ్యాటింగ్ కోచ్
ఐపీఎల్ సందర్భంగా కరోనా బారిన పడిన సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీకి తాజాగా చేసిన పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంఛైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
మైకేల్ హస్సీ, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్
ఐపీఎల్ 14వ సీజన్ సందర్భంగా మైకేల్ హస్సీ కరోనా బారిన పడ్డారు. దీంతో మే 4న లీగ్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐతో పాటు ఐపీఎల్ పాలకమండలి ప్రకటించింది.