Chahal ODI Wickets: టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. వన్డేల్లో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో ఒక్క వికెట్ తీస్తే.. ఈ ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుని 23వ భారత్ ఆటగాడిగా రికార్డుకెక్కనున్నాడు.
ఇప్పటివరకు 59 వన్డేలు ఆడిన చహల్.. 5.19 సగటుతో 99 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్లు, రెండుసార్లు 4 వికెట్ల ఘనత సాధించాడు. వన్డేల్లో అతనికి 6/42తో అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి.