తెలంగాణ

telangana

ETV Bharat / sports

అచ్చం జడ్డూలా బ్యాట్​ను తిప్పేసిన చాహల్​.. వీడియో వైరల్​! - chahal imitates jadeja batting

Yuzvendra Chahal: ఐపీఎల్​ 15వ సీజన్​ ఆసక్తికరంగా సాగుతోంది. రాజస్థాన్​ రాయల్స్​ జట్టు లెగ్​ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ వికెట్లు తీస్తూ అదరగొడుతున్నాడు. ఇక ముందు జరిగే మ్యాచుల్లోనే అద్బుతంగా రాణించాలని ప్రాక్టీస్​ చేస్తున్నాడు. ప్రాక్టీస్​ ముగిశాక నెట్స్​లో సీఎస్​కే కెప్టెన్ రవీంద్ర​ జడేజాలా బ్యాట్​ తిప్పేశాడు. ప్రస్తుతం ఆ వీడియో అభిమానులను అలరిస్తోంది. మీరు కూడా చూసేయండి.

Chahal Imitates Ravindra Jadeja
Chahal Imitates Ravindra Jadeja

By

Published : Apr 15, 2022, 6:57 AM IST

Updated : Apr 15, 2022, 8:28 AM IST

Yuzvendra Chahal Ravindra Jadeja: రాజస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ఈ సీజన్‌లో అత్యధిక వికెట్ల వీరుడి జాబితాలో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీసి అందరికన్నా ముందున్నాడు. అయితే, ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో అతడు బ్యాట్‌తోనూ రాణించాలని చూస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆ జట్టు అభిమానులతో పంచుకుంది. చాహల్‌ హెల్మెట్‌కు గో ప్రో కెమెరా పెట్టుకొని బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయగా పలు బంతుల్ని వదిలేశాడు. మరికొన్నింటిని సిక్సర్లు బాదేందుకు ప్రయత్నించాడు.

అయితే, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ముగిశాక నెట్స్‌లో నుంచి బయటకు వస్తున్న అతడు బ్యాట్‌ను చెన్నై కెప్టెన్‌ రవీంద్ర జడేజాలా తిప్పేశాడు. జడ్డూ ఏదైనా మ్యాచ్‌లో అర్ధ శతకం లేదా, శతకం బాదినప్పుడు తన బ్యాట్‌ను కత్తిలా తిప్పడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చాహల్‌ కూడా అచ్చం అలానే తన బ్యాట్‌ను ఒంటి చేత్తో తిప్పేశాడు. ఆ వీడియో ఇప్పుడు రాజస్థాన్‌ అభిమానులను అలరిస్తోంది. మీరూ ఓ లుక్కేసి ఆనందించండి. రాజస్థాన్​ టీంలో.. బౌలింగ్‌లో చాహల్‌, బ్యాటింగ్‌లో జోస్‌ బట్లర్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ వీరిద్దరూ ఇలాగే చెలరేగితే రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరడం ఖాయంలా కనిపిస్తోంది.

ఇవీ చదవండి

Last Updated : Apr 15, 2022, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details