తెలంగాణ

telangana

ETV Bharat / sports

CCL 2023: తెలుగు వారియర్స్​కు చెన్నై రైనోస్​ షాక్​.. కానీ సెమీ ఫైనల్స్​లోకి!

2023 సెలబ్రిటీ క్రికెట్ లీగ్​లో తెలుగు వారియర్స్ వరుస దూకుడుకి బ్రేక్​ పడింది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో తమిళ రైనోస్​ విజయం సాధించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 12, 2023, 9:40 PM IST

2023 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తుది దశకు చేరుకుంటుంది. ఇక తెలుగు వారియర్స్ ఇప్పటివరకు దూకుడుగా ఆడుతూ పాయింట్స్ పట్టికలో డామినేషన్ చూపించింది. అయితే తమిళ హీరోల టీమ్ చెన్నై రైనోస్ నుంచి వారికి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన మ్యాచ్​లో తెలుగు వారియర్స్​ ఓటమి పాలైంది.

10 ఓవర్లతో రెండేసి ఇన్నింగ్స్​లతో టెస్ట్ ఫార్మాట్​లో సీసీఎల్​ మ్యాచులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఇన్నింగ్స్​లో చెన్నై ప్లేయర్స్​ను 84 పరుగులకే కట్టడి చేశారు తెలుగు వారియర్స్​ బౌలర్లు. అసలు మొదట 5 ఓవర్స్​కు తమిళ టీమ్​లో సగం మంది బ్యాటర్లు పెవిలియన్​కు చేరారు. అందులో కలరీ అరిసం 28(18) పరుగులు చేసి ధీటుగా నిలబడి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇక రఘు 3 వికెట్లు, ప్రిన్స్ రెండు వికెట్లు తీశారు.

ఇక తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్​ను కూల్​గా స్టార్ట్ చేయాలని అనుకుంది. కానీ మొదటి ఓవర్​లోనే ఊహించని విధంగా అక్కినేని అఖిల్ ఔట్ అయ్యారు. అఖిల్ సింగిల్ డిజిట్ స్కోర్ చేయడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రాషన్ ఒక్కడే 56 రన్స్ చేసి టాప్​ స్కోరర్​గా నిలిచారు. తమిళ టీమ్​ బౌలింగ్ స్ట్రాంగ్​గా ఉన్నప్పటికీ మిగతా వాళ్లు నిలదొక్కుకున్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్​లో పై చేయి సాధించింది తెలుగు హీరోలు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులు సాధించారు.

ఇక రెండవ ఇన్నింగ్స్​లో తమిళ హీరోలు మంచి స్కోర్​ను అందించారు. మొదట విష్ణు విశాల్ 24 పరుగులు చేయగా ఆ తర్వాత పృథ్వీ 12 బంతుల్లో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్స్​గా నిలిచారు. ఇక తెలుగు హీరోల్లో తమన్ మూడు వికెట్లు తీయగా.. నందకిషోర్ 2 వికెట్లు అందుకున్నారు. రెండవ ఇన్నింగ్స్​లో చెన్నై రైనోస్ 119 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది.

ఇక రెండో ఇన్నింగ్స్​లో 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఊహించని విధంగా ఆటను స్టార్ట్ చేశారు. తమన్, అశ్విన్ బాబు ఓపెనర్లుగా దిగారు. అయితే 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తెలుగు వారియర్స్ కష్టాల్లో పడింది. ఇక ఆ తరువాత సచిన్ జోషి కూడా ఎక్కువ సేపు ఉండలేకపోయారు. 5 పరుగులే వెనుదిరిగారు. అనంతరం అఖిల్ అక్కినేని ఆటను కాస్త ట్రాక్​లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అతను 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఒకవిధంగా చెన్నై రైనోస్ బౌలింగ్ స్ట్రాంగ్​గా ఉండడం వల్ల తెలుగు హీరోలు బాల్స్​ను బౌండరీకి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంతకుముందు సెంచరీ బాదిన అఖిల్ ఈ మ్యాచ్​లో 30 పరుగులు కూడా చేయలేకపోయారు. మొత్తానికి తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 80 పరుగులకే ఆటను ముగించింది. కానీ తెలుగు వారియర్స్​ టీమ్​ సెమీఫైనల్స్​కు చేరినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details