తెలంగాణ

telangana

'కోహ్లీ, సర్ఫరాజ్​ ఒకటే.. కానీ ధోనీ స్టైల్​ వేరు'

By

Published : Jun 7, 2021, 5:25 AM IST

జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లీ(టీమ్​ఇండియా), సర్ఫరాజ్​ అహ్మద్(పాకిస్థాన్​ మాజీ) కెప్టెన్సీ ఒకేలా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు​. వీరిద్దరితో పోలిస్తే ధోనీ(Dhoni) సారథ్యం చాలా భిన్నంగా ఉంటుందని చెప్పాడు.

Kohli
కోహ్లీ

కోహ్లీ(టీమ్​ఇండియా), సర్ఫరాజ్​ అహ్మద్(పాకిస్థాన్​ మాజీ) కెప్టెన్సీ ఒకేలా ఉంటుందని అన్నాడు దక్షిణాఫ్రికా మాజీ సారథి​ ఫాఫ్(Faf du plesis)​ డుప్లెసిస్​. జట్టును ముందుండి నడిపించడంలో వీరిద్దరి శైలి ఒకే తరహాలో ఉంటుందని చెప్పాడు. అయితే వీరిద్దరితో పోలిస్తే భారత జట్టు మాజీ కెప్టెన్​ ధోనీ సారథ్యం భిన్నమైనదని వెల్లడించాడు.

"సర్ఫరాజ్​ లాగే కోహ్లీ(Kohli) కూడా మైదానంలో దూకుడుగా ఉంటాడు. ఇద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది. కానీ మహీ(Dhoni) చాలా కూల్​గా, రిజర్వ్​డ్​గా ఉంటాడు. సందర్భానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో అతడే ఉత్తమం. ఏదేమైనప్పటికీ జట్టును నడిపించడంలో ఎవరి శైలి వారికి ఉంటుంది" అని డుప్లెసిస్​ వివరించాడు.

జూన్​ 9 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్​ సూపర్​ లీగ్​(పీఎస్​ఎల్​)లో పాల్గొననున్నాడు డుప్లెసిస్​. ఈ టోర్నీలో క్వెట్టా గ్లాడియేటర్స్​ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్​లో ఇతడు చెన్నై సూపర్​కింగ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి Kohli: ధోనీ గురించి కోహ్లీ రెండు మాటల్లో

ABOUT THE AUTHOR

...view details