తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేప్​టౌన్​ పిచ్​పై ఐసీసీ ఫైర్​ - రేటింగ్‌ ఎంతంటే?

Capetown Pitch ICC Rating : కేప్​టౌన్​ పిచ్​ వివాద నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ పిచ్‌కు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ రేటింగ్​ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 7:24 PM IST

Capetown Pitch ICC Rating :గత కొద్ది రోజులుగా అటు సౌతాఫ్రికా ప్లేయర్లు ఇటు టీమ్ఇండియా స్టార్స్​ నోట్లో నానుతున్న వివాదాస్పద కేప్​టౌన్ న్యూలాండ్స్‌ పిచ్​కు తాజాగా ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డు - రెండో టెస్టుకు ఉపయోగించిన పిచ్‌ నాసిరకంగా ఉందంటూ పేర్కొంది. దీంతో నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా క్రికెట్‌ను మందలిస్తూ ఆ పిచ్​కు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది. ఈ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్‌ బ్రాడ్‌ నివేదిక ప్రకారమే ఈ తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో భాగంగా రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ పిచ్​కు 'అసంతృప్తికరం' అని రేటింగ్‌ ఇచ్చాడు.

"న్యూలాండ్స్‌లోని పిచ్‌లో బ్యాటింగ్ చేయడానికి కష్టంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాల్​ భయంకరంగా బౌన్స్‌ అయింది. దీంతో షాట్లు ఆడేందుకు చాలా కష్టమైంది. బౌన్స్ కారణంగానే వికెట్లు కూడా ఎక్కువగా నేలకూలాయి" అని బ్రాడ్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి భారత్​ - సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఈ పిచ్​ పై క్రికెట్ అనలిస్ట్​లు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా పేస్ బౌలింగ్​కు అనుకూలించిన ఈ పిచ్ పై తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు 55 పరుగులు మాత్రమే సాధించి కుప్పకూలింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమ్ఇండియా 153 పరుగులు సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా టీమ్ మార్‌క్రమ్ 172 పరుగులతో చెలరేగాడు. 79 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.

అయితే ఈ మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ కూడా ఈ పిచ్ పై పరోక్షంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమకు ఇలాంటి పిచ్​లపై ఆడటానికి ఇబ్బందేమీ లేదని, అయితే ఇక నుంచి ఇండియాలో మొదటి రోజు నుంచే స్పిన్ అయ్యే పిచ్​లు ఎదురైనా విమర్శించకూడదంటూ వ్యాఖ్యానించాడు.

'భారత్ పిచ్​లపై మాట్లాడే వారు నోరు మూసుకోవాలి- మా వద్ద బంతి తిరిగితే ఒప్పుకోరా?'

రోహిత్ కామెంట్స్​పై ఐసీసీ గరం!- చిక్కుల్లో కెప్టెన్?

ABOUT THE AUTHOR

...view details