తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు.. కెప్టెన్​ కోహ్లీపైనే కళ్లన్నీ!

IND VS SA 3rd Test: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు మంగళవారం నుంచి జరగనుంది. సిరీస్‌లో ఇప్పటికే చెరో మ్యాచ్‌లో విజయం సాధించిన ఇరు జట్లు.. చివరి మ్యాచ్‌లో గెలుపుపై వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మూడో మ్యాచ్‌లో గెలిచి.. దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన పరితపిస్తోంది.

Virat Kohli
IND VS SA

By

Published : Jan 11, 2022, 4:53 AM IST

Updated : Jan 11, 2022, 6:03 AM IST

IND VS SA 3rd Test: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య చివరి మ్యాచ్‌.. కేప్‌టౌన్‌ వేదికగా జరగనుంది. సిరీస్‌లో ఇప్పటికే చెరో మ్యాచ్‌లో గెలిచిన భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు.. కీలకమైన మూడో మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొదటి మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న తర్వాత గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్‌ కోహ్లీ.. మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాలో అందని ద్రాక్షలా ఉన్న టెస్టు సిరీస్‌ను.. ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్‌కు.. కోహ్లీ రాక అదనపు బలాన్ని అందించింది. కెరీర్‌లో 99వ టెస్టు ఆడనున్న కోహ్లీ.. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో సత్తాచాటాలని భావిస్తున్నాడు. లోపాలను అధికమించి.. భారీ స్కోర్‌ సాధించాలని క్రికెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

విరాట్ కోహ్లీ

ఇలా జరిగితేనే..

తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్‌ జట్టు.. రెండో టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబర్చింది. కీలకమైన మూడో టెస్టులో తిరిగి సత్తాచాటాలని భావిస్తోంది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్, కేఎల్ రాహుల్‌ స్థాయికి తగ్గట్టు రాణిస్తే.. భారీ స్కోర్‌కు బాటలు వేసే అవకాశం ఉంది. రెండో టెస్టులో పర్వాలేదనిపించిన.. ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె.. మరింత మెరుగ్గా రాణించాలని జట్టు ఆశిస్తోంది. బ్యాటింగ్‌లో విఫలమవుతున్న వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. తన ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. ఆల్‌రౌండర్ల రూపంలో అశ్విన్, శార్దూల్‌ ఠాకూర్‌ కూడా రాణిస్తే.. దక్షిణాఫ్రికాపై భారీ స్కోర్‌ కష్టమేమీ కాదు. కేప్‌టౌన్‌ మైదానంలో.. ఇప్పటివరకూ విజయాన్ని అందుకోలేకపోయిన భారత్‌ జట్టు.. ఈ రికార్డును మార్చాలని యోచిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌ అవకాశం వస్తే.. 300కంటే ఎక్కువ పరుగులు చేయాలని అంచనా వేస్తోంది.

టీమ్​ఇండియా

జోరు చూపించాలి.. మళ్లీ!

తొలి టెస్టులో సత్తాచాటిన భారత బౌలర్లు.. రెండో మ్యాచ్‌లో నిరాశపర్చారు. మూడో టెస్టులో మునుపటి జోరు అందుకోవాలని భారత్‌ జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ స్థానంలో.. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బుమ్రా, అశ్విన్‌ కూడా.. వారికి స్థాయికి తగ్గట్లు వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాను కట్టడి చేయవచ్చని భారత్‌ జట్టు అంచనా వేస్తోంది.

సఫారీ జట్టుతో భారత్ ఢీ

రెండో టెస్టులో విజయం తర్వాత.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్న దక్షిణాఫ్రికా జట్టు కూడా సిరీస్‌పై కన్నేసింది. భారత్‌కు ఏమాత్రం కలిసిరాని కేప్‌టౌన్‌ మైదానంలో రెట్టించిన ఉత్సాహంతో చెలరేగాలని భావిస్తోంది. కసిగో రబాడ, ఒలీవియర్‌, లుంగి ఎంగిడి, మాక్రో జాన్సెన్‌ వంటి విభిన్న ప్రతిభావంతులైన బౌలర్ల సాయంతో.. భారత్‌ జట్టును కట్టడి చేయాలని వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్‌లోనూ సారథి డీన్‌ ఎల్గర్‌, బవుమా వంటివారు తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే.. భారీ స్కోర్లు సాధించవచ్చని అంచనా వేస్తోంది.

ఇవీ చూడండి:

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు.. కోహ్లీ ఈ రికార్డు సాధించేనా?

టీమ్ఇండియాకు కలిసిరాని కేప్​టౌన్.. మరి ఈసారైనా?

IND vs SA: 'ఆ విజయం యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది'

Last Updated : Jan 11, 2022, 6:03 AM IST

ABOUT THE AUTHOR

...view details