రివ్యూలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. లేదంటే పూర్తి మ్యాచ్‌నే కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాడు. 2019 యాషెస్‌లో ఆస్ట్రేలియా.. సమీక్ష కోరడంలో చేసిన తప్పిదాల కారణంగా చవిచూసిన ఓటమిని తాను ఎప్పటికీ మరచిపోనని గుర్తుచేశాడు.
ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజున.. రూట్‌ను పెవిలియన్ పంపాలనే ఆతృతలో రెండు రివ్యూలను వృథా చేశాడు కోహ్లీ. ఈ రెండు సందర్భాల్లోనూ మహ్మద్ సిరాజే బౌలర్. పైగా రెండు సార్లూ బంతి స్పష్టంగా స్టంప్స్ ఆవల నుంచి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే రివ్యూలు తీసుకునే క్రమంలో కోహ్లీ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశాడు లక్ష్మణ్. టెస్టు క్రికెట్లో డీఆర్ఎస్ చాలా కీలకమని అన్నాడు.
"హెడింగ్లేలో ఇంగ్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా టెస్టు ఓడిన విధానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. జాక్ లీచ్‌కు నాథన్ లైయన్ వేసిన బంతి లెగ్ స్టంప్‌కు ఆవల వెళ్లినా కూడా రివ్యూకు వెళ్లి దానిని వృథా చేశాడు టిమ్ పైన్. ఆ వెంటనే.. బెన్‌స్టోక్స్ వికెట్ల ముందు దొరికాడు. కానీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆసీస్‌కు సమీక్షలేవీ మిగలలేదు. దీంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది."
-లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్
భావోద్వేగాలకు లోనవ్వొద్దు..
సమీక్ష కోరే సమయంలో కోహ్లీ చుట్టూ ఒక గందరగోళ పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డాడు లక్ష్మణ్.
"ప్యాడ్లకు తగిలే ప్రతి బంతి ఔట్ అని బౌలర్ అనుకుంటాడు. కానీ, కెప్టెన్ ప్రశాంతంగా ఆలోచించాలి. మ్యాచ్ స్థితిగతులపై స్పష్టమైన అవగాహనతో ఉండే కొద్ది మందిపై విశ్వాసముంచి ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలి. రివ్యూలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు గురికాకూడదు. అది పూర్తి మ్యాచ్‌నే దూరం చేస్తుంది."