CAB Covid: బంగాల్ క్రికెట్ జట్టుపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా బంగాల్ మాజీ మంత్రి, అండర్-25 క్రికెట్ జట్టు కోచ్ లక్ష్మీరతన్ శుక్లాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో.. అతడితో సన్నిహితంగా మెదిలిన వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం లక్ష్మీరతన్ ఐసోలేషన్ ఉన్నట్లు పేర్కొన్నారు.
బంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా కూడా కొవిడ్ బారిన పడినట్లు క్యాబ్ పేర్కొంది. అవిషేక్‌కు జ్వరంతో పాటు స్వల్ప కొవిడ్ లక్షణాలున్నట్లు వెల్లడించింది.
ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొవిడ్ బారినపడ్డాడు. అనంతరం వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ నిర్వహణపై క్లారిటీ ఇచ్చాడు.