Bumrah Return : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఐర్లాండ్ పర్యటనకు 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. బుమ్రాను టీమ్ఇండియాకు కెప్టెన్‌గా నియమించింది. కాగా రుతురాజ్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. కాగా టమ్ఇండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
India Tour Of Ireland 2023 : ఆగస్టు 18 నుంచి భారత్.. ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు డబ్లిన్ మైదానం వేదిక కానుంది. కాగా అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమౌతాయి. కాగా ఈ సిరీస్‌తో ఐపీఎల్ స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మ టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కనుంది.
- మొదటి టీ 20 - ఆగస్టు 18
- రెండో టీ 20 - ఆగస్టు 20
- మూడో టీ 20 - ఆగస్టు 23
Bumrah Recovery : అయితే వెన్ను గాయం కారణంగా బుమ్రా గతేడాది నుంచి జట్టుకు దూరమయ్యాడు. 2022 ఆసియా కప్, 2022 ప్రపంచకప్ టోర్నీలో కూడా భారత్.. బుమ్రా లేకుండానే ఆడింది. ఆ టోర్నీల్లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. కాగా గత కొంతకాలంగా బుమ్రా.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పర్యవేక్షణలో ఉన్నాడు. రీసెంట్గా బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'కమింగ్ హోం' అంటూ ఓ వీడియోను స్టోరీలో షేర్ చేశాడు. దాంతో త్వరలోనే బుమ్రా రీ ఎంట్రీ పక్కా అనుకున్న ఫ్యాన్స్‌కు సోమవారం బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది.
ఇక ఐర్లాండ్ పర్యటనతో బుమ్రా టచ్‌లోకి వస్తే.. టీమ్ఇండియా బౌలింగ్ కష్టాలు తీరినట్టే. కాగా భారత్ రానున్న మూడు నెలల్లో జరిగే ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆడనుంది.
ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు..
జస్ప్రిత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ ధూబే, వాషింగ్టన్ సుందర్, షహ్బాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్.