ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ ఐదో ర్యాంకులోనే ఉండగా.. పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్(834 పాయింట్ల).. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రెండు వరుస హాఫ్‌సెంచరీలు చేసి(అఫ్గానిస్థాన్‌పై 51, నమీబియాపై 70 పరుగులు) ఈ ఘనతను అందుకున్నాడు. తన కెరీర్లో ఈ ఫీట్‌ను అందుకోవడం ఇది ఆరోసారి. ఇక భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎనిమిది ర్యాంకులోనే ఉండగా.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం తన ర్యాంకును మెరుగుపరచుకుని 23వ స్థానానికి ఎగబాకాడు.
బౌలింగ్ విభాగంలో బుమ్రా ఏకంగా పది స్థానాలు ముందుకు జరిగి 24వ ర్యాంకులో నిలవగా.. కెరీర్లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు డి సిల్వా. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా మూడు వికెట్ల ప్రదర్శన చేసి ఈ మార్క్‌ను అందుకున్నాడు.