తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL: వన్డే సిరీస్​కూ బుమ్రా దూరం.. అతడి విషయంలో బీసీసీఐ ప్లాన్ ఏంటో? - వన్డే సిరీస్​కు ముందు టీమ్​ఇండియాకు భారీ షాక్​

శ్రీలంకతో వన్డే సిరీస్​ ముందుకు టీమ్​ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్​కు కూడా బుమ్రా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అసలు అతడి విషయంలో బీసీసీఐ ప్లాన్​ ఏంటో?

Bumrah Miss ODI Teamindia Srilanka series
వన్డే సిరీస్​కు కూడా బుమ్రా దూరం.. బీసీసీఐ ప్లాన్​ అదేనా?

By

Published : Jan 9, 2023, 3:46 PM IST

టీమ్​ఇండియాకు భారీ షాక్ తగిలింది. గౌహతి వేదికగా శ్రీలంకతో జనవరి 10 నుంచి ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు స్టార్‌ బౌలర్‌ పేసు గుర్రం బుమ్రా దూరమయ్యాడు. వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా.. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేని కారణంగా ప్రస్తుతం అతడిని తప్పించనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో బుమ్రా వన్డే జట్టుతో కలవకుండా ఎన్‌సీఏలోనే ఉండిపోయాడు. కాగా, బుమ్రా చివరిసారిగా సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లోఆడాడు. అప్పటి నుంచి బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు. టీ20 ప్రపంచ కప్‌లోనూ చోటు కోల్పోయాడు. ఇకపోతే అతడి సహచరులు, టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటికే తొలి వన్డేకు వేదిక అయిన గౌహతికి చేరుకున్నారు.

వేరే కారణం.. లంకతో వన్డే సిరీస్​కు బుమ్రాను తప్పించడానికి ఇతర కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో కీలక సిరీస్‌లు (న్యూజిలాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​, ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌, వన్డే వరల్డ్‌కప్‌) ఉన్నందున.. మరోసారి అతడు గాయాల బారిన పడకుండా ఉండేందుకు.. బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా తప్పించినట్లు సమాచారం అందుతోంది.

శ్రీలంక మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), వాషింగ్టన్‌ సుందర్‌,చాహల్, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్, షమి, సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

ఇదీ చూడండి:పంత్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇక అతడికి పండగే!

ABOUT THE AUTHOR

...view details