తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా ఫిట్​నెస్​పై అప్డేట్​ ఇచ్చిన సూర్యకుమర్​.. ఏం చెప్పాడంటే? - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ బుమ్రా ఫిట్​

గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్​కు దూరమైన భారత స్టార్ పేసర్​ బుమ్రా ఫిట్​నెస్​ గురించి అప్డేట్​ ఇచ్చాడు సూర్యకుమార్​ యాదవ్​. ఏం చెప్పాడంటే..

bumrah fitness
బుమ్రా ఫిట్​నెస్​

By

Published : Sep 22, 2022, 8:55 PM IST

నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20కు ముందు టీమ్​ఇండియా ఫ్యాన్స్​కు గుడ్‌ న్యూస్‌. గాయం కారణంగా తొలి టీ20కు దూరమైన భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో అతడు కీలకమైన రెండో టీ20కు తుది జట్టులోకి రానున్నాడు. ఈ విషయాన్ని భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

గురువారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. "బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు నాగ్‌పూర్‌ మ్యాచ్‌కు జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం జట్టులో అందరూ ఫిట్‌గా ఉన్నారు" అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్‌ చేతిలో టీమ్​ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోర్‌ సాధించినప్పటికీ.. ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో విఫలకావడం వల్ల ఓటమి తప్పలేదు. దీంతో రెండో టీ20లో ఏలగైనా విజయం సాధించి సిరీస్‌ సమం చేయాలని భారత్‌ భావిస్తోంది.

ఇదీ చూడండి: IND VS AUS: వామ్మో ఏందిది.. ఈ ఫొటోలు చూశారా?.. టికెట్ల కోసం మరీ ఇంతలా..

ABOUT THE AUTHOR

...view details