తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టుల్లో బుమ్రా 400 వికెట్లు తీయడం పక్కా!' - ambrose praises bumrah

టీమ్​ఇండియా స్టార్ పేసర్ బుమ్రాకు తాను పెద్ద అభిమానినని వెస్టిండీస్​ దిగ్గజం కర్ట్​ లీ ఆంబ్రోస్ చెప్పాడు.​ అతడు టెస్టు​ కెరీర్​లో కచ్చితంగా 400 వికెట్లను తీస్తాడని అభిప్రాయపడ్డాడు. మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా శైలి భిన్నంగా ఉంటుందని అన్నాడు. ​

bumrah
బుమ్రా

By

Published : May 9, 2021, 3:27 PM IST

టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాను ప్రశంసించాడు వెస్టిండీస్​ మాజీ పేసర్​ కర్ట్​ లీ ఆంబ్రోస్​. భవిష్యత్​లో అతడు టెస్టుల్లో కచ్చితంగా 400 వికెట్ల మార్క్​ను అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.

"నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. భారత్​లో ఉత్తమమైన ఫాస్ట్​ బౌలర్లు కొంతమంది ఉన్నారు. నేను చూసిన బౌలర్లలో అతడు ఎంతో ప్రత్యేకం, ప్రతిభావంతుడు. భవిష్యత్​లో మరింత బాగా, ఎక్కువ కాలం రాణిస్తాడని ఆశిస్తున్నాను. సీమ్​, స్వింగ్​, యార్కర్లు.. ఇలా అన్ని విధాలుగా బౌలింగ్​ చేయగలడు. కాబట్టి ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండి ఆడగలిగితే కచ్చితంగా 400 వికెట్లను అందుకోవడం ఖాయం" అని ఆంబ్రోస్ అన్నాడు.

ఇప్పటివరకు బుమ్రా 19 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. 63 వన్డేల్లో 108 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. త్వరలో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​ సిరీస్​లోనూ ఇతడు ఆడనున్నాడు.

ఇద చూడండి: బుమ్రా.. డెత్‌ ఓవర్స్‌ రక్షకుడు!

ABOUT THE AUTHOR

...view details