తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొడుకుపైనా దయ చూపని బ్రెట్‌లీ.. క్లీన్​బౌల్డ్ చేసి! - Brett Lee bowling to his son

Brett Lee News: మేటి బ్యాటర్లపై ఫాస్ట్​ బాల్స్​తో విరుచుకుపడిన మాజీ స్టార్​ బౌలర్ బ్రెట్​లీ. ఆటకు దశాబ్దం కిందటే వీడ్కోలు పలికిన అతడు మరోసారి బంతి చేతబట్టాడు. ఈ సారి నిర్దయగా తన కుమారుడిని క్లీన్​బౌల్డ్​ చేశాడు.

Brett Lee
Brett Lee bowling to his son

By

Published : Jan 1, 2022, 4:34 PM IST

Brett Lee News: మునుపటి తరం ఫాస్ట్‌ బౌలర్లలో బ్రెట్‌లీ ఒకడు. తన అద్భుతమైన డెలివరీలతో బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేసిన సందర్భాలు ఎన్నో..! నిర్దయగా వికెట్ల వేట సాగించేవాడు. అలాంటి బ్రెట్‌లీ పదేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేసి కామెంటేటర్‌గా మారిపోయాడు. ఇప్పుడు మరోసారి తన బౌలింగ్‌ ప్రతిభను ప్రదర్శించాడు. అయితే ఏ జట్టు మీదనో అనుకోకండి.. సరదాగా కుమారుడు ప్రెస్టోన్‌తో క్రికెట్‌ ఆడుతూ బౌలింగ్‌ వేశాడు. అప్పుడు ప్రత్యర్థులను తన బౌలింగ్‌తో దెబ్బకొట్టినట్లే.. ఇప్పుడు కుమారుడిపై కూడా ఏమాత్రం కనికరం లేకుండా యార్కర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియోను బ్రెట్‌లీ సోదరుడు, మాజీ క్రికెటర్‌ షేన్‌లీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పాపం.. బౌల్డ్‌ అయిన ప్రెస్టోన్‌ బ్యాట్‌ను విసిరేసిన దృశ్యం అందులో కనిపిస్తోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

ఇదీ చూడండి:ఘనంగా టీమ్​ఇండియా న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​

ABOUT THE AUTHOR

...view details