Brendon McCullum Coach: యువ బ్యాటర్ శుభ్‌మన్‌గిల్‌ను కోల్పోవడం తమ ఫ్రాంచైజీకి దెబ్బేనని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరిలో జరగబోయే మెగా వేలం కోసం సన్నద్ధమవుతున్నామని మెక్‌కల్లమ్ తెలిపాడు. అభిమానులతో జరిగిన మాటామంతీ కార్యక్రమంలో మెక్‌కల్లమ్ మాట్లాడాడు. "రిటెన్షన్ వల్ల చాలా మంది ఆటగాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. అయితే గిల్‌ను వదులుకోవడం నిరాశపరిచింది. కొన్నిసార్లు జీవితం ఇలానే ఉంటుంది. ఇదే సమయంలో మెగా వేలం కోసం సంసిద్ధంగా ఉంటాం" అని వెల్లడించాడు. గిల్‌ను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ. 8 కోట్లకు ఎంచుకుంది.
రిటెన్షన్ విధానంలో కేకేఆర్ శుభ్‌మన్‌ను కేకేఆర్ వదిలేసుకుంది. ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్‌ను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. దాని కోసం కేకేఆర్ రూ. 42 కోట్లను వెచ్చించనుంది. "సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ ఇప్పటికే ఛాంపియన్లుగా నిరూపించుకున్నారు. గత రెండు సీజన్లలో వరుణ్ చక్రవర్తి సామర్థ్యం ఏంటో చూసేశాం. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 రెండో దశలో వెంకటేశ్ అయ్యర్ చెలరేగాడు. ఇలాంటి వారికి బ్యాకప్‌గా జట్టును ఎంపికను చేయడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం" అవుతుదని మెక్‌కల్లమ్ వివరించాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!