తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ క్రికెటర్​పై మూడున్నరేళ్ల నిషేధం: ఐసీసీ - జింబాంబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్

Brendan Taylor spot fixing: స్పాట్ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసిన జింబాంబ్వే మాజీ సారథి బ్రెండన్​ టేలర్​పై నిషేధం విధించింది ఐసీసీ. మూడున్నర ఏళ్ల పాటు అతడు క్రికెట్​కు దూరంగా ఉండాలని పేర్కొంది.

Brendan Taylor
బ్రెండన్ టేలర్

By

Published : Jan 28, 2022, 7:14 PM IST

Updated : Jan 28, 2022, 7:27 PM IST

Brendan Taylor spot fixing: జింబాంబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్​పై మూడున్నర ఏళ్లపాటు నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఓ బుకీ నుంచి కొంత మొత్తంలో డబ్బు తీసుకుని స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఒప్పుకుంటూ ఇటీవలే అతడు సంచలన విషయాలు బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో బ్రెండన్.. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉండాలని ఐసీసీ పేర్కొంది.

వేరే దారి లేక..!

"రెండేళ్లుగా నేను ఈ భారాన్ని మోస్తున్నా. ఈ కారణంగా కొన్ని రోజులు చీకట్లో కూడా బతకాల్సి వచ్చింది. నా మానసిక ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. 2019లో ​ ఓ భారత వ్యాపారవేత్తతో స్పానర్​షిప్​ గురించి మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను. జింబాబ్వేలో ఓ టీ20 ప్రారంభించాలని ఆలోచనతో ఉన్నాం. అప్పటికే మాకు బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేపు. చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాం. వాళ్లు నాకు రూ. 15వేల డాలర్లు ఇస్తానన్నారు. మా మీటింగ్​ చివరి రాత్రి ఆ బిజినెస్​మ్యాన్​, అతడి మనషులు నన్ను కలవడానికి వచ్చారు. పార్టీ ఇచ్చారు. కొకైన్​ ఆఫర్​ చేశారు. కాదనలేక తీసుకున్నా. ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడాలని బెదిరించారు. ఆ తర్వాతి రోజు అతడు నా హోటల్​ రూమ్​కు కూడా వచ్చాడు. అతడితో పాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్లని చూసి భయమేసింది. ఏం చేయాలో తెలియక వాళ్లు చెప్పినదానికి అంగీకరించాను. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. స్వదేశానికి వచ్చిన ఆ తర్వాత ఆ సంఘటన మానసికంగా శారీరకంగా చాలా దెబ్బతీసింది. ఆ వ్యాపారవేత్త తరచుగా ఫోన్​ చేసేవాడు. మ్యాచ్​ ఫిక్సింగ్​ చేయకపోతే తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించేవాడు. ఈ విషయాన్ని ఐసీసీకి చెప్పడానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది. కానీ నేను ఎటువంటి మ్యాచ్​ ఫిక్సింగ్​లలో పాల్గొనలేదు. ఇప్పుడీ విషయాన్ని బయటపెట్టడం వల్ల ఐసీసీ నాపై ఏడాది కన్నా ఎక్కువ సంవత్సరాలు నిషేధం విధించవచ్చు. అయితే నాకు జరిగిన ఈ విషయం, కొత్త క్రికెటర్లు జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నా కుటుంబం, నా స్నేహితులు, మరీ ముఖ్యంగా నన్ను నేను మోసం చేసుకుంటూ బతకలేను. విలువలతో బతకాలనేదే నా ఉద్దేశం."

-- జింబాబ్వే మాజీ కెప్టెన్​ బ్రెండన్​ టేలర్.

Last Updated : Jan 28, 2022, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details