ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందిన కరేబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకూ తాను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించాడు. బ్రావోను బౌలింగ్ కోచ్‌గా నియమించిన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. వ్యక్తిగత కారణాలతో లక్ష్మీపతి బాలాజీ ఏడాదిపాటు కోచింగ్‌కు దూరం కానుండటం వల్ల అతడి స్థానంలో బ్రావో తమ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని సూపర్ కింగ్స్ తెలిపింది. సూపర్ కింగ్స్ అకాడమీకి బాలాజీ సేవలు అందుబాటులో ఉంటాయని సీఎస్కే స్పష్టం చేసింది.
IPL: రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో.. ఇకపై బౌలింగ్ కోచ్‌గా - సీఎస్కే బ్రావో రిటైర్మెంట్
ఐపీఎల్ 2023కు ముందు డ్వేన్ బ్రావో కీలక నిర్ణయం తీసుకున్నాడు. లీగ్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు తెలిపాడు. అయితే అతడినిబౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ వెంటనే ప్రకటించింది.
కాగా, 161 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బ్రావో 183 వికెట్లు తీశాడు. దాదాపు 130 స్ట్రైక్ రేట్‌తో 1560 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో బ్రావో కీలక పాత్ర పోషించాడు. 2011 నుంచి సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న బ్రావో.. ఆ జట్టు 2011, 2018, 2021ల్లో ఐపీఎల్ గెలవడంతోపాటు.. 2014లో ఛాంపియన్స్ లీగ్ టీ20 గెలవడంతో ముఖ్యపాత్ర పోషించాడు. రెండుసార్లు పర్పుల్ క్యాప్ సాధించిన తొలి విదేశీ బౌలర్‌గా బ్రావో రికార్డ్ క్రియేట్ చేశాడు. 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో నిలిచాడు.
ఇదీ చూడండి:ఆసీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టుకు తెలుగమ్మాయి ఎంపిక.. స్టార్ ఆల్ రౌండర్ ఔట్