ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. "ఐపీఎల్లో భాగంగా నాకు పదేళ్ల క్రితం నాటి బకాయిలు రావాల్సి ఉంది.. అవి రావడానికి ప్రస్తుతానికి ఏదైనా అవకాశం ఉందా? బీసీసీఐ" అంటూ ట్వీట్ చేశాడు. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళకు ప్రాతినిధ్యం వహించాడు హాగ్.
భారత మహిళా క్రికెటర్లకు గతేడాది ప్రపంచకప్‌కు సంబంధించి రన్నరప్ ప్రైజ్‌మనీ రావాల్సి ఉందని ఓ ప్రముఖ ఛానల్ కథనం ప్రచురించింది. చెల్లింపుల విషయంలో మహిళా, పురుష క్రికెటర్ల మధ్య అసమానతలు ఉన్నాయంటూ అందులో వెల్లడించింది. ఈ విషయం వైరల్‌గా మారింది. దీంతో త్వరలోనే వారికి ఆ ప్రైజ్‌మనీని చెల్లిస్తామని బోర్డు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాడు తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.