BBL Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడా విశేషాదారణ దక్కించుకుంది. ఇందులో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్లోనే కాక దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. టీమ్ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా పలుమార్లు బన్నీ హావాభావాల్ని అనుకరిస్తూ వీడియోలు పోస్ట్ చేశాడు. తాజాగా ఈ సినిమా క్రేజ్ బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆ దేశ బౌలర్ బన్నీ 'తగ్గేదే లే' సన్నివేశాన్ని కాపీ కొట్టి అందర్నీ ఆకట్టుకున్నాడు.
ఇదీ జరిగింది