టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం సులభమని అన్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్. అయితే వారిద్దరికీ బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదని తెలిపాడు.
"కోహ్లీ, రోహిత్.. ఇద్దరికీ బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదు. చెప్పాలంటే.. విరాట్తో పోలిస్తే రోహిత్కు బౌలింగ్ చేయడం సులభం. ఎందుకంటే ఆతడు ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడు. రోహిత్ను నేను.. రెండు విధాలుగా (ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్) ఔట్ చేయగలను. ఒక రకంగా కోహ్లీకి బౌలింగ్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే అతడు ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణిస్తాడు."