బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 4 టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యం సాధించింది. కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ మట్లాడుతూ.. 'మాకు అద్భుతమైన విజయం వచ్చింది. నిన్న మేము కొంచెం వెనకబడ్డాము. కానీ, ఈ రోజు తిరిగి పుంజుకుని మ్యాచ్ గెలిచాం. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కన్నా ఒక పరుగు వెనుకంజలో ఉన్నప్పుడు మేము వెనుకబడ్డామని భావించా. కానీ మా బౌలర్లు అద్భుతంగా ఆడారు" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
'కంగారూలు తప్పు చేసేదాకా వేచి చూసి.. జడేజా, అశ్విన్‌తో మాట్లాడి ప్లాన్ వేశాం'
దిల్లీ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. మ్యాచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆసీస్ ప్లేయర్లు తప్పు చేసే దాకా వెయిట్ చేశామని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే..
తప్పు చేయాలనే వెయిట్ చేశాం..
కంగారూలు తప్పు చేసేదాగా వేచి చూడలనుకున్నామని రోహిత్ తెలిపాడు. ఆ తర్వాత అంతా తాము అనుకున్నట్టే జరగిందని వెల్లడించాడు. ' రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌తో చర్చించి ప్లాన్స్ వేశాం. ఇంలాంటి పరిస్థితుల్లో జడేజా, అశ్విన్ ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. దీంతో వారికి బౌలింగ్ విషయంలో స్వేచ్ఛనిచ్చా. జడేజా, విరాట్ కోహ్లీ.. అక్షర్ పటేల్, అశ్విన్ నెలకొల్పిన పార్టనర్‌షిప్‌లు మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ స్లో పిచ్‌పై 100 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పడం అంత సులభం కాదు' అని రోహిత్ శర్మ వెల్లడించాడు.