బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య కీలకమైన మూడో టెస్టు ఇందౌర్‌లో ప్రారంభమైంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించి జోరు మీద ఉన్న రోహిత్ సేన.. మూడో టెస్టులో మాత్రం కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 33.2 ఓవర్లలోనే కేవలం 109 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు శుభమన్ గిల్ మాత్రమే పర్వాలేదనింపించారు. మిగతా వారంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కున్మెన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. లైయన్ మూడు వికెట్లు తీయగా.. మర్ఫీ ఒక్క వికెట్ పడగొట్టాడు.
IND Vs AUS: ఆసీస్ స్పిన్ మాయాజాలం.. మూడో టెస్ట్‌లో చేతులెత్తేసిన టీమ్ఇండియా!
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 33.2 ఓవర్లలోనే ఆలౌటయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు శుభమన్ గిల్ మాత్రమే పర్వాలేదనింపించారు.
border gavaskar trophy team india first innings
ఇక, పరుగుల వీరుడు కింగ్ కోహ్లీకి స్వదేశంలో 200వ అంతర్జాతీయ టెస్ట్. తన ప్రత్యేకమైన టెస్టులో విరాట్ నిరాశపర్చాడు. మర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ భారీ స్కోరు చేసి చాలా కాలమైంది. 2020 నుంచి అతడు ఈ ఫార్మాట్‌లో సెంచరీ నమోదు చేయలేదు. 2020లో మూడు టెస్టులు ఆడితే మొత్తం 116 పరుగులు చేశాడు. ఇక 2021లో 11 మ్యాచ్‌ల్లో 536 పరుగులు, గత ఏడాది ఆరు మ్యాచుల్లో 265 పరుగులు చేశాడు.
Last Updated : Mar 1, 2023, 5:34 PM IST