తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలా అంటే రోహిత్​ ఊరుకుంటాడా.. ఆసీస్‌ టీమ్​కు ఇచ్చి పడేశాడుగా! - ఆస్ట్రేలియా జట్టుకు గట్టి కౌంటర్​ రోహిత్ శర్మ

మరో రోజులో బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా జట్టుకు గట్టి కౌంటర్​ ఇచ్చాడు భారత కెప్టెన్​ రోహిత్ శర్మ. ఏం అన్నాడంటే?

border gavaskar trophy rohith sharma
రోహిత్ శర్మ బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ

By

Published : Feb 8, 2023, 4:48 PM IST

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మరో రోజులో ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు జరిగే నాగ్‌పూర్‌ పిచ్‌పై ఆస్ట్రేలియా మాజీలు, అక్కడి మీడియా వర్గాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చకుంటున్నారని భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తాజాగా ఈ ఆరోపణలపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఆటపై దృష్టి పెట్టాలని.. పిచ్‌పై కాదంటూ ప్రత్యర్థికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

"ఆటపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై కాదు. ఇక్కడ ఆడే 22 మంది ఆటగాళ్లు నాణ్యమైన ఆటగాళ్లే" అంటూ సమాధానమిచ్చాడు. ఇక పిచ్‌ గురించి మాట్లాడుతూ.. ఇది స్పిన్నర్లకు సహకరిస్తుందని.. ఈ పరిస్థితుల్లో స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. 'ప్రణాళికతో ఆడటం ఎంతో ముఖ్యం. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. కొందరు స్వీప్‌ షాట్లు ఆడటానికి ఇష్టపడతారు. కొందరు బౌలర్‌పై నుంచి కొట్టడానికి ప్రయత్నిస్తారు. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం అవసరం. కొన్నిసార్లు ఎదురు దాడి చేయాలి" అని రోహిత్‌ వివరించాడు.

ఇక ఈ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.."ఇదొక ఛాలెంజింగ్‌ సిరీస్‌. ఈ సిరీస్‌ను మేం గెలవాలనుకుంటున్నాం. సన్నద్ధతే కీలకం. మనం బాగా సిద్ధమైతే.. అందుకు తగ్గ ఫలితాలను పొందొచ్చు" అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:హెల్త్​ అప్డేట్​ ఇచ్చిన పంత్​.. ఇప్పుడెలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details