తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేెఎల్​ రాహుల్​కు హెచ్చరిక.. ఇకనైనా సరిచేసుకుంటాడా?

సోషల్​మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. మీమ్స్​, కామెంట్స్​తో క్రికెట్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. అదేంటంటే కేఎల్‌ రాహుల్‌కు వరుస అవకాశాలు ఇవ్వడమే. ఇక ఈ పోరు తట్టుకోలేకపోయిందో.. లేదా అతడి ప్రదర్శనపై విసుగు చెందిందో కానీ.. ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో రాహుల్‌కు ఉన్న వైస్‌ కెప్టెన్‌ ట్యాగ్‌ను తీసేసింది. దీంతో అతడికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కథనం మీకోసం..

KL Rahul vice captaincy
KL Rahul vice captaincy

By

Published : Feb 20, 2023, 6:42 PM IST

టీమ్​లో వైస్‌ కెప్టెన్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో కీలక పాత్ర. కష్టసమయాల్లో ఓ సారథిగా టీమ్ సభ్యులకు సలహాలు, సూచనలు చేస్తూ జట్టును ముందుకు నడిపించాలి. ఇక అతడు ఓపెనర్‌ అయితే మాత్రం బ్యాటింగ్‌లో మెలకువలు చూపిస్తూ జట్టుకు అండగా నిలవాల్సిన రెస్పాన్సిబిలటీ ఉంటుంది. మరింత బాధ్యాతయుతంగా ఆడాలి. కానీ ఓ కెప్టెన్​తో పోలిస్తే అతడిపై ఒత్తిడి తక్కువే. కానీ ఎంతో అద్భుతంగా ఆడే కేఎల్​ రాహుల్​.. వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత నుంచి అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అభిమానులకు నిరాశే మిగులుస్తున్నాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్‌పై ఏదా కాస్త పర్వాలేదనిపించాడు. ఆ చిన్న జట్టుపై ఆడటం పెద్ద కష్టమేమి కాదు. అయితే ప్రస్తుతం బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్​ సిరీస్​లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఈ సిరీస్​లో ఇప్పటివరకు అతడు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 38 రన్స్​ మాత్రమే చేయడం గమనార్హం.

గత పది ఇన్నింగ్స్​లో.. 71 బంతుల్లో 20 పరుగులు.. 41 బంతుల్లో 17 పరుగులు.. 3 బంతుల్లో ఒక్క పరుగు.. ఇవీ టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా గత మూడు ఇన్నింగ్స్‌ల్లో కేఎల్‌ రాహుల్‌ ఆడిన ఆటతీరు. మూడు కాదు గత పది ఇన్నింగ్స్‌లను చూసినా ఇలాంటి పేలవ ప్రదర్శన తప్పే మరేది కనపడదు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఈ పది ఇన్నింగ్స్​లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 23 పరుగులే కావడం గమనార్హం. అదీ కూడా బంగ్లాదేశ్‌పై చేశాడు. అందుకే కేఎల్​ రాహుల్​పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది బోర్డు. ​ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగలింది.

అక్కడైతే బెటర్... వాస్తవానికి టీ20ల్లో ఓపెనర్‌గా బాగానే రాణించిన కేఎల్ రాహుల్‌.. టెస్టు ఫార్మాట్​లోకి వచ్చేసరికి సరిగ్గా ఆడలేకపోతున్నాడు. బంతులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. ఇది అభిమానులను మరింత కలవరపెడుతోంది. అసలు ఇన్నింగ్స్​ ప్రారంభంలో జాగ్రత్తగా ఆడి.. క్రీజ్‌లో సెటిల్ అయ్యాక ధనాధన్​ ఇన్నింగ్స్​ సర్వసాధారణం. కానీ, కేఎల్​ రాహుల్‌ మాత్రం అటు డిఫెన్స్‌ ఆడలేక.. ఇటు దూకుడుగా బ్యాటింగ్‌ చేయలేక సతమతమవుతున్నాడు. ఫస్ట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 12 ఓవర్లపాటు క్రీజులో ఉన్న కేఎల్​ రాహుల్‌.. కేవలం 20 రన్స్​ మాత్రమే చేశాడు. బంతి ఎలా వస్తుందో ఓ అంచనాకు వచ్చినప్పటికీ.. ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించలేక చతికిలపడుతున్నాడు. ఒత్తిడి లేనప్పుడే రాహుల్‌ సరిగా ఆడలేకపోతే.. ఇక ప్రెజర్​ పడినప్పుడు ఎలా ఆడతాను అనేది అటు క్రికెట్​ ఫ్యాన్స్​, ఇటు మాజీల ప్రశ్న. అయితే, అతడిని మిడిలార్డర్‌ పంపితే మంచిది అనే వాదనా కూడా వినిపిస్తోంది. ఓపెనర్‌గా మరొకరిని సెలెక్ట్​ చేసి.. ఎలాగో రాహుల్​ కీపింగ్‌ చేస్తాడు కాబట్టి మిడిలార్డర్‌లో ఆడిస్తే బెటర్​ అని సలహాలు వినిపిస్తున్నాయి. అక్కడైతే పెద్దగా ఒత్తిడి ఉండదు కాబట్టి.. అతడు ఫామ్‌ను తిరిగి అందుకనే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అతడికి ముప్పే...ఇకపోతే ఇప్పటికే టీమ్‌ఇండియాలో స్థానాల కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది. అయినా సరే.. వరుసగా ఫెయిల్​ అవుతున్న రాహుల్‌ను కొనసాగించడం కరెక్ట్​ డెసిషన్​ కాదనే విమర్శ వినిపిస్తోంది. అయితే జట్టులో రాహుల్​ స్థానం మారిస్తే.. అతడి కోసం యంగ్ ప్లేయర్​ శ్రీకర్‌ భరత్‌ త్యాగం చేయాల్సిన ఉంటుంది. రాహుల్‌ ఎలాగో స్వతహాగా కీపర్‌ కాబట్టి.. తుది జట్టులో అదొక్క స్థానమే ఖాళీ అయ్యే ఛాన్స్​ ఉంది. శ్రీకర్‌ను పక్కన పెట్టి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తే.. ఓపెనర్‌గా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌కు ఛాన్స్​ వస్తుంది. ఇకపోతే గిల్‌ ఇప్పటికే తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. లేకపోతే కొత్తగా ట్రై చేయాలని బీసీసీఐ భావిస్తే మాత్రం సూర్యకుమార్‌ను ఓపెనర్​గా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రీసెంట్​గా టెస్టు ఫార్మాట్‌లో రాహుల్‌ పెద్దగా వికెట్‌ కీపింగ్‌ చేసిన సందర్భాలు లేవు. దాదాపు మూడు రోజుల పాటు, అదీ కూడా స్పిన్‌ పిచ్‌లపై కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమంటే కష్టమైన పనే. కాబట్టి ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, రెండో టెస్టులో శ్రీకర్ భరత్‌ దూకుడుగా మంచి ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో అతడిని ఓపెనర్‌గా పంపి, రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తే మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనప్పటికీ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో రాహుల్​ బాగా రాణిస్తేనే అతడి టెస్టు కెరీర్​ సురక్షితంగా సాగుతుంది. లేకపోతే చేతులెత్తేయడమే. ఇప్పటి వరకు అతడు 47 టెస్టులను ఆడి.. 33.34 సగటుతో 2,642 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు, 13 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 199.

ఇదీ చూడండి:T20 Worldcup: సెమీస్​ బెర్త్​.. టీమ్ఇండియాకు ఉన్న ఛాన్స్​లివే!

ABOUT THE AUTHOR

...view details