తెలంగాణ

telangana

ETV Bharat / sports

షమి దెబ్బకు గాల్లోకి ఆఫ్​ స్టంప్.. షాక్ అయిన వార్నర్​! - ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్​ సిరీస్​

ఆసిస్​తో టీమ్​ ఇండియా తొలి పోరుఆరంభమైంది. విదర్భ స్టేడియం వేదికగా గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్​ ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతోంది. అయితే తొలుత దిగిన ఓపెనర్స్​కు మన బౌలర్లు చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

India Vs Australia
India Vs Australia

By

Published : Feb 9, 2023, 12:41 PM IST

Updated : Feb 9, 2023, 12:58 PM IST

నాగ్​పుర్​ స్టేడియంలో బార్డర్​ గావస్కర్​ ట్రోఫీ ప్రారంభమైంది. గురువారం మొదలైన ఈ టెస్ట్​ సిరీస్​లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియాతో రోహిత్​ సేన తలపడుతోంది. తొలుట టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్​ టీమ్​ లంచ్​ బ్రేక్​ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.

ఆసిస్​ తరఫున తొలుత బ్యాటింగ్​కు దిగిన ఉస్మాన్​ ఖవాజా,డేవిడ్​ వార్నర్లకు చుక్కలు చూపించారు టీమ్​​ ఇండియా బౌలర్స్​​ షమి, సిరాజ్​. ఇన్నింగ్స్​లోని మొదటి ఓవర్​లో మహ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతికే ఉస్మాన్​ ఖవాజా వికెట్ తీశాడు. ఈ బాల్ ను ఊహించని ఖవాజా లెగ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బాల్ అతని ప్యాడ్స్​కు తగిలింది. అయితే ఇండియన్ ప్లేయర్స్ గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూ తీసుకున్నారు. రీప్లేల్లో బంతి లెగ్ స్టంప్​కు తగిలినట్లు స్పష్టంగా తేలింది. దీంతో ఖావాజా స్కోర్​ నమోదు చేయకుండానే పెవిలియన్​ బాట పట్టాడు.

ఆ తర్వాత ఓవర్లో దిగిన షమి డేవిడ్ వార్నర్​ను ఔట్​ చేశాడు. నిప్పు గోళంలా దూసుకొచ్చిన ఆ బాల్​కు సమాధానం చెప్పలేకపోయాడు వార్నర్​. అంతే దెబ్బకు అతని ఆఫ్ స్టంప్ గాల్లోకి ఎగిరింది. దీంతో వార్నర్​ షాక్ అయిపోయాడు. అలా తొలి రెండు ఓవర్లల్లోనే ఇద్దరు ఆసిస్​ ప్లేయర్స్​ను కంగారు పెట్టించి పెవిలియన్​ బాట పట్టించిన సిరాజ్​ షమీలు ఇప్పుడు సోషల్​ మీడియాలో హీరోలైపోయారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

Last Updated : Feb 9, 2023, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details