బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. టీమ్ఇండియా వికెట్లు నష్టపోకుండా 25 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (18), కేఎల్ రాహుల(12) పరుగులు చేశి క్రీజులో ఉన్నారు. మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 263 పరుగులకే ఆలౌటైంది. భారత బౌరర్లు రాణించినప్పటికీ.. కంగారూ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్కాంబ్ (72) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. ఆసీస్ స్కోరు బోర్డును పరుగెత్తించారు. మరో ఆసీస్ బ్యాటర్ కమిన్స్ (33) ఫర్వాలేనిపించాడు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీశాడు. జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగట్టి ఆసీస్‌ను పెద్ద దెబ్బ తీశారు.
Ind VS Aus : తొలిరోజు ఆట పూర్తి.. క్రీజులో రోహిత్, రాహుల్
దిల్లీ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 21/0 స్కోరు సాధించి.. 242 పరుగులు వెనుకబడింది.
రాహుల్ అదిరిపోయే క్యాచ్...
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత క్యాచ్ పట్టాడు. మహ్మద్ షమీ వేసిన లాంగ్ లెంత్ బాల్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బ్యాటుకు చివరకు తగిలి.. సెకండ్ స్లిప్ మీదుగా ఫీల్డర్ రాహుల్ వద్దకు వెళ్లింది. దీంతో మొకాళ్లపై పడి రాహుల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఆసీస్ 108/4 వద్ధ 31.2 ఓవర్లో ట్రావిస్ ఔట్ అయ్యాడు. కాగా, రాహుల్ కొన్ని రోజులుగా తన రాణించలేకపోతున్నాడు. ఈ మధ్య కాలంలో మంచి స్కోరు కూడా సాధించలేకపోయాడు. దీంతో జట్టులో అతడిని తీసుకోవడంపై క్రీడా నిపుణులు, అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సూర్యకుమార్ యాదవ్ బదులు శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో శ్రేయస్ అయ్యర్‌ను బదులు రాహుల్‌ను తప్పిస్తే బాగుండేదని సోషల్ మీడియా వేదికగా టీమ్ మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి :BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా.. ఆమోదించిన జై షా