తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS AUS: రెచ్చిపోయిన అశ్విన్​, ఉమేశ్​ యాదవ్​.. ఆసీస్​ ఆలౌట్ - Border Gavaskar trophy updates

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో.. ఓవర్​ నైట్​ స్కోరు 156/4తో రెండు రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్​.. తొలి ఇన్నింగ్స్​లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్​లో 88 పరుగులు వద్ద ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టీమ్​ఇండియా 109 పరుగులు వద్ద ఆలౌట్ అయింది.

Border Gavaskar trophy
IND VS AUS third test innings break

By

Published : Mar 2, 2023, 11:17 AM IST

Updated : Mar 2, 2023, 12:11 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో రెండు రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్​ నైట్​ స్కోరు 156/4తో ప్రారంభించిన ఆసీస్​పై అశ్విన్​, ఉమేశ్​ యాదవ్​ తమ బౌలింగ్​తో విజృంభించారు. దీంతో ఆసీస్​​ తొలి ఇన్నింగ్స్​లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. అలా మొదటి ఇన్నింగ్స్​లో 88 పరుగులు వద్ద ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టీమ్​ఇండియా 109 పరుగులు వద్ద ఆలౌట్ అయింది.

మొదట.. ఓవర్‌నైట్ స్కోరు 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకి పీటర్ హ్యాండ్స్‌ కోంబ్, కామెరూన్ గ్రీన్ కలిసి శుభారంభం అందించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే 98 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను అశ్విన్ పెవిలియన్ పంపాడు. హ్యాండ్స్​కోంబ్​.. అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత ఉమేశ్​ యూదవ్​ కూడా తన బౌలింగ్​తో మ్యాజిక్ చేశాడు. అతడు.. 57 బంతుల్లో 2 ఫోర్లతో 21 రన్స్​ చేసిన కామెరూన్ గ్రీన్​ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అలానే మిచెల్ స్టార్క్‌(1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆ తర్వాత అలెక్స్ క్యారీ(3).. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే టాడ్ ముర్ఫీని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అలా వరుసగా 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. చివరిగా 5 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడం వల్ల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి 197 స్కోరు వద్ద తెరపడింది.

12 పరుగుల తేడాతో.. ఆస్ట్రేలియా జట్టులోని ఆఖరి ఆరు వికెట్లను 12 పరుగుల తేడాతో కుప్పకూల్చారు భారత బౌలర్లు. రెండు రోజు ఆటలో రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. తొలి రోజులోని మొదటి 4 వికెట్లను రవీంద్ర జడేజా తీశాడు. మొత్తంగా ఆసీస్​ బ్యాటర్లలో ఖ్వాజా(60), లబుషేన్​(31), స్టీవ్​ స్మిత్​(26), ట్రావిస్ హెడ్​(9).. జడ్డూ బౌలింగ్​ లో ఔట్ అయ్యారు.

ఉమేశ్-అశ్విన్​ రికార్డు..ఈ ప్రదర్శనతో ఉమేశ్ తన టెస్టు కెరీర్‌లో 164 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో 24.7 యావరేజ్​తో 101 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు స్వదేశంలో టీమ్​ఇండియా ప్లేయర్స్​లో కపిల్ దేవ్ (219), జవగళ్ శ్రీనాథ్(108), జహీర్ ఖాన్(104), ఇషాంత్ శర్మ(104) వికెట్లు తీశారు. ఇకపోతే ఓవరాల్‌గా రవిచంద్రన్​ అశ్విన్ 688 అంతర్జాతీయ వికెట్లు తీసి.. టీమ్​ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 687 వికెట్లు తీసిన కపిల్ దేవ్‌ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 956 వికెట్లు, హర్భజన్ సింగ్ 711 తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.

Last Updated : Mar 2, 2023, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details