తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి రోజు ఆట పూర్తి.. జడ్డూ 4 వికెట్లు.. ఆసీస్​ ఆధిక్యం ఎంతంటే? - మూడో టెస్టు జడేజా నాలుగు వికెట్లు

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​లో.. మొదటి రోజు ఆటముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టడంలో జడేజా విజృంభించాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు.

IND VS AUS third test
టీమ్​ఇండియా వర్సెస్​ ఆస్ట్రేలియా మూడో టెస్టు

By

Published : Mar 1, 2023, 4:45 PM IST

Updated : Mar 1, 2023, 5:32 PM IST

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటిమిని అందుకున్న ఆస్ట్రేలియా.. ప్రస్తుతం కీలకమైన మూడో టెస్టులో మాత్రం టీమ్‌ఇండియాకు గట్టి పోటీనిస్తోంది. తొలి రోజు తన స్పిన్​ మాయాజాలంతో ఆటను ఆధీనంలోకి తీసుకుంది. తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియాను 33.2 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూల్చింది. స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ, యంగ్​ ప్లేయర్​ శుభమన్​ గిల్​ కూడా తమ జట్టును ఆదుకోలేకపోయారు. ఆసీస్​ బౌలర్లలో కున్​మెన్​(5/16) ఐదు వికెట్లతో ఆకట్టుకోగా... లైయన్​ మూడు వికెట్లు, మర్ఫీ ఒక్క వికెట్​ పడగొట్టాడు.

అయితే ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్​ బ్యాటర్లను.. జడ్డూ తన స్పిన్​తో మాయ చేశాడు. 4/16తో అదరగొట్టాడు. ​అలా ఆసీస్​ బ్యాటర్లలో ఉస్మాన్​ ఖ్వాజా(60) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఆ తర్వాత మార్నస్​ లబుషేన్​(31), స్టీవ్​ స్మిత్​(26) యావరేజ్​గా రాణించారు. మొత్తంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 54 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. క్రీజులో పీటర్‌ హాండ్స్‌కాంబ్ (7), కామెరూన్‌ గ్రీన్‌ ( 6) కొనసాగుతున్నారు.

టీమ్​ఇండియా ఆట ఇలా సాగింది.. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్​ఇండియాకు శుభారంభం దక్కిందనే చెప్పాలి. కెప్టెన్​ రోహిత్‌ శర్మ, శుభమన్​ గిల్ క్రీజులో ఉన్నంతసేపూ వేగంగా పరుగులు వచ్చాయి. దీంతో భారత్​ భారీ స్కోరు చేస్తుందని క్రికెట్​ ప్రియులు ఆశించారు. కానీ గేమ్​ అడ్డం తిరిగింది. ఆరో ఓవర్‌లో కునెమన్‌.. రోహిత్‌ను ఔట్‌ చేసిన తర్వాత జట్టు పరిస్థితి ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. వరుసగా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఎనిమిదో ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్ (21) కూడా కునెమన్‌ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే లైయన్‌ బౌలింగ్‌లో పుజారా (1) ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్‌ (0) కూడా క్రీజులో నిలబడలేకపోయారు.

అలా కష్టాల్లో పడిన భారత్‌ను ఆదుకుంటాడనుకున్న విరాట్‌ కోహ్లీ కూడా(22) ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. టాడ్‌ మార్ఫీ బౌలింగ్‌లో పెవిలియన్​ చేరాడు. అనంతరం లైయన్‌ బౌలింగ్​లో కేఎస్ భరత్ (17) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం 84/7తో రెండో సెషన్‌ను ప్రారంభించిన టీమ్​ఇండియా మరో 25 పరుగులు చేసి చివరి మూడు వికెట్లను కూడా కోల్పోయింది. అలా 33.2 ఓవర్లలోనే 109 పరుగులకు ఆలౌట్​ అయింది.

ఇదీ చూడండి:ICC Test rankings: అగ్రస్థానానికి దూసుకెళ్లిన అశ్విన్​

Last Updated : Mar 1, 2023, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details