టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువు తగ్గి ఫిట్‌గా మారాలని క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సూచించాడు. జట్టు సారథి ఫిట్‌గా లేకపోతే అది సిగ్గు చేటు అని వ్యాఖ్యానించాడు. "ప్లేయర్స్‌కు ఫిట్‌గా ఉండడం ఎంతో ముఖ్యం. ఇక కెప్టెన్ విషయానికి వస్తే అతను ఇంకా ఫిట్‌నెస్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కెప్టెన్ ఫిట్‌గా లేకపోవడం సిగ్గుచేటే. ఫిట్‌నెస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఇంకా కష్టపడాలి. వాస్తవానికి అతను ఓ గొప్ప బ్యాటర్. కానీ ఫిట్‌నెస్ పరంగా చూస్తే కాస్త అధిక బరువుతో ఉన్నాడని అనిపిస్తోంది. చాలా మంది టీవీలో ఒకలా కనిపిస్తే బయట నిజ జీవితంలో మరోలా భిన్నంగా కనిపిస్తారు. కానీ నేను చూసిన దాని ప్రకారం రోహిత్ శర్మ ఇంకా ఫిట్‌గా మారాల్సిన అవసరం చాలా ఉంది. అయితే విరాట్ కోహ్లీని ఎప్పుడు చూసినా.. ఫిట్‌నెస్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది" అని కపిల్ దేవ్ తెలిపాడు.
'కెప్టెన్ ఫిట్‌గా ఉండాలి'.. రోహిత్‌పై కపిల్ దేవ్ కామెంట్స్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువు తగ్గి ఫిట్‌గా మారాలని క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సూచించాడు. జట్టు సారథి ఫిట్‌గా లేకపోతే అది సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించాడు.
rohit sharma
కాగా బార్డర్ గావస్కర్ ట్రోఫీని ఆడుతున్న టీమ్ ఇండియా ప్లేయర్స్ ప్రస్తుతం ఆసిస్‌ను చిత్తు రేపే పనిలో ఉన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో స్టార్ క్రికెటర్ కెప్టెన్ రోహిత్ శర్మ తరచూ గాయాల కారణంగా టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. గాయాలకు చికిత్స పొంది తిరిగి ఫామ్‌లోకి వచ్చినప్పటికీ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.