దాదాపు రెండు నెలల తర్వాత టీమ్‌ఇండియా మళ్లీ టెస్టు ఫార్మాట్ క్రికెట్‌ను ఆడేందుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తర్వాత వరుసగా టీ20లు, వన్డేలు ఆడిన భారత జట్టు.. అతిపెద్ద సమరమైన ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ .. నాలుగు టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఇందులో భాగంగా నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పర్యాటక ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్‌కు మారుతుందనే అభిప్రాయంతో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ బౌలింగ్ దాడికి దిగనుంది. ఇకపోతే చాలా కాలంగా టెస్టు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్‌కు ఎట్టకేలకు ఈ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఆసీస్ తరఫున టాడ్ మర్ఫీ డెబ్యూ చేశాడు.
జట్లు వివరాలు: