నాగ్‌పుర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 20 పరుగులు చేసి టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 66 బంతుల్లో 56* పరుగులు చేశాడు. కాగా అశ్విన్(0*) ఖాతా తెరవలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులకు ఆల్ఔట్ అయింది. దీంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగుల వెనుకంజలో ఉంది.
IND VS AUS: రోహిత్ హాఫ్ సెంచరీ.. తొలి రోజు ఆట పూర్తి - y IND VS Aus first test first day
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ఇండియా ఆస్ట్రేలియా మధ్య తొలి రోజు ఆట ముగిసింది. గేమ్ పూర్తయ్యేసిరికి టీమ్ఇండియా 101 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 63.5 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లబుషేన్ (49) పరుగులతో రాణించాడు. స్టీవెన్ స్మిత్ (37), హ్యాండ్స్కోంబ్ (31), అలెక్స్ (36) పరుగులతో పర్వాలేదనిపించారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఇరగదీశారు. ముఖ్యంగా చాలా రోజుల గ్యాప్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న జడేజా తన ఆకలి తీర్చుకున్నాడు. 5 వికెట్లు తీసి కంగారూలకు ముచ్చెమటలు పట్టించాడు. అశ్విన్ కూడా రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్, షమీ చెరో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: Srikar Bharat: అమ్మ ఆశీర్వాదం తీసుకుని.. అదిరిపోయే స్టంపౌట్‌తో మెరిసి..