Border Gavaskar Trophy 2023 : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్లేయర్లకు గాయాలు అవుతుండటం వల్ల ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. భారత్‌తో జరిగే తొలి టెస్టు ముందే ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేలికి గాయం అవడం వల్ల జట్టుకు దూరమయ్యాడు. తాజాగా మరో పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఎడమ కాలికి గాయం అయింది. దీంతో అతడు కూడా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదివరకే గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్.. ఇప్పుడే కోలుకుంటున్నాడు. అతడు మొదటి టెస్టు వరకు అందుబాటులో ఉండకపోవచ్చు. స్టార్ బౌలర్లు జట్టుకు దూరమవడం వల్ల.. ఆస్ట్రేలియా టీమ్ బలహీన పడే అవకాశం ఉంది.
ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో మరో స్టార్ ప్లేయర్ దూరం! - జోష్ హేజిల్‌వుడ్‌కు గాయం
Border Gavaskar Trophy 2023 : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదలుకానున్న నేపథ్యంలో.. ఆసీస్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇదివరకే స్టార్ పేసర్ టీమ్‌కు దూరమవగా.. తాజాగా మరో ప్లేయర్ గాయాలపాలయ్యాడు. టీమ్ఇండియా బౌలర్లను ఎదుర్కొనడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కంగారూ జట్టుకు ఇది గట్టి దెబ్బే.
కాగా, టీమ్ఇండియా స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆసీస్ పూర్తి స్థాయిలో సమాయాత్తమవుతోంది. అందుకోసం కఠోర సాధన చేస్తోంది. అందులో భాగంగా కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలోని పిచ్‌ను కఠినంగా తయారు చేయించుకని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. మరోమెట్టు పైకెక్కి.. అచ్చం అశ్విన్‌లా స్పిన్ వేసే బౌలర్ అని పేరున్న మహేష్ పితియాను రప్పించుకుంది ఆసీస్ జట్టు. గతంలో అశ్విన్‌ను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడ్డ కంగారూ బ్యాటర్లు.. ఈసారి ఈ ఉపాయం చేశారు. ఇక, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగు టెస్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది.